దేశద్రోహ చట్టంపై వివాదమేంటి? ఇది సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్లింది?
బ్రిటీషు కాలంలో రూపొందించిన దేశద్రోహ చట్టం ఇప్పటికీ అవసరమా? అని ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వలస కాలపు చట్టం స్వతంత్ర భారతదేశంలో ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారని ప్రశ్నించడంతో నిజంగా ఈ చట్టం అవసరమా అని చర్చలు మొదలయ్యాయి

Sedition Law : బ్రిటీషు కాలంలో రూపొందించిన దేశద్రోహ చట్టం ఇప్పటికీ అవసరమా? అని ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వలస కాలపు చట్టం స్వతంత్ర భారతదేశంలో ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారని ప్రశ్నించడంతో నిజంగా ఈ చట్టం అవసరమా అని చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వాల వైఫల్యాలపై గళం విప్పుతున్న వారి గొంతునొక్కేందుకు సెక్షన్ 124aని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రాజద్రోహ చట్టం రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ఎవరు వేశారు? అసలు ఎందుకు ఈ పిటిషన్ వేయాల్సి వచ్చిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భావ ప్రకటన స్వేచ్ఛకు దేశద్రోహ చట్టం అడ్డుగా నిలుస్తోందని.. ప్రాథమిక హక్కులను అడ్డుకుంటుందని.. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మాజీ సైనికాధికారి ఎస్జీ వొంబాత్కేరే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 124ఏ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని.. దీన్ని వెంటనే రద్దు చేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే భారత శిక్షాస్మృతిలోని దేశద్రోహం సెక్షన్‌ను రద్దు చేయాలని వొంబాత్కేరే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం వెనుక పెద్ద కథే ఉంది. ఆయన భారత సైన్యం నుంచి మేజర్‌గా పదవీ విరమణ పొందాక.. కర్ణాటకలోని మైసూర్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత చెట్ల పరిరక్షణకు తనవంతుగా కృషి చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ప్రాజెక్టుల పేరుతో చెట్ల నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ పలు ఉద్యమాలు చేశాడు.
ఈ క్రమంలో మైసూర్ సమీపంలో చామలపురలో థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం కోసం చెట్లను నరకడంతో పాటు వారసత్వ భవనాలను కూల్చివేయాలని భావించారు. దీంతో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆయన పోరాటం చేశాడు. మైసూరు చాముండి హిల్స్ శక్తిపీఠానికి చేరే దారి విస్తరణను కూడా ఆయన అడ్డుకున్నాడు. ఈ నిర్ణయం వల్ల వందల చెట్లు నరికివేయాల్సి వస్తుందని ఆయన నిరసనలు తెలిపాడు. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద దేశద్రోహం కేసు నమోదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపితే దేశద్రోహిని ఎలా అవుతానని ఆయన ప్రశ్నించారు. సెక్షన్ 124ఏ కింద నమోదైన పలు కేసులను పరిశీలించిన ఆయన ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నిర్ధారించుకున్నాడు. అందుకే ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. వొంబాత్కేరే వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సుప్రీంకోర్టే వద్దంటున్న రాజద్రోహం చట్టంలో ఏముంది? సెక్షన్ 124Aను అసలెందుకు తీసుకొచ్చారు?
Sanjal Gavande : మన అమ్మాయిలు అమెరికాలోనూ అదరగొడుతున్నారు
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం
పేదలకు అండగా.. ఒక్కడే 100 ఇండ్లు కట్టించి ఇచ్చాడు
వందేండ్లు కాదు.. 130 ఏండ్లు బతుకొచ్చు అంటున్న శాస్త్రవేత్తలు.. అదెలా?
కూలి పనులు మాని యూట్యూబ్‌లో లక్షలు సంపాదిస్తున్నాడు..
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

