అమరత్వం సాధ్యమే : మనిషి జీవనకాలానికి పరిమితి లేదంటున్న పరిశోధకులు!

కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సరదాగా గడుపుతూ దీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలని కోరుకోని వారుండరు. భూమిపై చావనేది లేకుండా ఉండిపోవాలనీ కలలు కనేవారుంటారు. వీరిలో ఆశలు రేకెత్తించేలా అసలు మనిషి జీవనకాలానికి పరిమితి లేదని తాజా పరిశోధన వెల్లడించింది. అయితే ఇప్పటివరకూ ఫ్రెంచ్ మహిళ, చైన్ స్మోకర్ జీన్ కాల్మెంట్ ఒకరు ఈ దిశగా అడుగులు వేశారు.

1997లో మరణించే నాటికి ఆమె వయసు 122 ఏండ్ల 164 రోజులు. ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా ఆమె రికార్డులకు ఎక్కారు. వయసు మీదపడిన తర్వాత భూమిపై నూకలు చెల్లే రోజులు దగ్గరపడతాయనే భయాలు, అపోహలు పక్కనపెడుతూ 100 ఏండ్లు పైబడి హాయిగా జీవిస్తున్న వారు క్రమంగా పెరుగుతున్నారు. మానవ శరీరానికి నిజంగా గడువు తీరే తేదీ ఉంటుందా..? అదే ఉంటే సిద్ధాంతపరంగా మనిషి నిరంతరం జీవించి ఉండే అవకాశాలూ లేకపోలేదనే దిశగా పరిశోధకులు అధ్యయనాల్లో మునిగితేలుతున్నారు.

గతంలో గోంపెజ్ ఈక్వేషన్ ఆధారంగా మనిషి అత్యధికంగా 140 ఏండ్లు జీవించవచ్చని లెక్కగట్టగా, ఈ ఏడాది ఆరంభంలో వెల్లడైన మరో అధ్యయనం 150 ఏండ్ల వరకూ మనిషి బతికేయవచ్చని అంచనా వేసింది. ఇక గతవారం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్లో ప్రచురితమైన తాజా పరిశోధన మనిషికి గరిష్ట జీవనకాలం అంటూ లేదని పేర్కొంది.
110 ఏండ్లు పైబడిన సూపర్ సెంచూరియన్లు, 105 ఏండ్లు పైబడిన శతాధిక వృద్ధుల తాజా గణాంకాలను పరిశీలించిన మీదట మనిషి 110 ఏండ్లకు చేరిన తర్వాత మరణించే ముప్పు 50-50గా ఉంటుందని అధ్యయన సహరచయిత ఆంధోని డేవిసన్ తెలిపారు. 110 ఏండ్లకు చేరిన తర్వాత మరో ఏడాది బతకడం లేదా మరణించడం అనేది ఇరువైపులా ఉండే నాణెంతో సమానమని చెప్పుకొచ్చారు. మొత్తంమీద మానవాళి జీవనకాలానికి పరిమితి అంటూ లేదని పరిశోధకులు తేల్చారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

