పెండ్లి వేడుకలకు సంబంధించిన పలు వీడియోలు ఇటీవల వైరల్గా మారుతున్నాయి. ఆయా వీడియోలకు పెద్దసంఖ్యలో వ్యూస్ రావడమే కాకుండా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదే తరహాలో మరో వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఈ వీడియోలో తన స్నేహితులైన కొత్త జంట ఎదుట ఓ వ్యక్తి నాగినీ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు అలరిస్తున్నాయి. కొద్దిసేపు డ్యాన్స్ చేసిన ఆ వ్యక్తి పెండ్లి కొడుకును కూడా తనతో కాలు కదపాలని కోరగా అతడు నిరాకరించాడు. ఈ వీడియో ఇన్స్టాగ్రాం సహా ఇతర సోషల్ మీడియా వేదికలపై భారీ సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.