న్యూఢిల్లీ : మ్యాగీతో ఇటీవల పలువురు తమదైన ప్రయోగాలు చేస్తూ నూడుల్స్ రుచులను ఆస్వాదిస్తున్నారు. మ్యాగీని కొందరు కూరగాయలతో ఇష్టపడుతుండగా మరికొందరు స్పైసీగా ఉండాలని ట్రై చేస్తున్నారు. గత కొద్దినెలలుగా ఫ్యాంటా మ్యాగీ నుంచి మ్యాగీ మిల్క్‌షేక్ వరకూ మ్యాగీతో ప్రయోగాలు జరుగుతుండగా తాజాగా ఘజియాబాద్‌కు చెందిన స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కోకొ కోలాతో మ్యాగీ చేసిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
బుక్కడ్ దిల్లీ కే అనే యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో స్ట్రీట్ ఫుడ్ వెండర్ న్యూ మ్యాగీ వెరైటీ తయారీని పంచుకున్నాడు. ప్యాన్‌లో ముందుగా నూనె, కూరగాయలను వేసి ఆపై కొద్దిగా ఉప్పు కొన్ని మసాలా దినుసులు వేశాడు. ఆ మిశ్రమంలో కోకొ కోలాను వేసి నూడుల్స్, మ్యాగీ మసాలాను బాగా కలిపి మూతపెట్టి ఉడికించాడు.
ఈ స్పైసీ వెరైటీ కొకొ కోలా మ్యాగీ ఘజియాబాద్‌లోని సాగర్ పిజ్జా పాయింట్ వద్ద అందుబాటులో ఉంటుందని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ డిష్‌పై నెటిజన్లు తలోరకంగా రియాక్టయ్యారు. ఈ డిష్ మొత్తం పాయిజన్ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇప్పటివరకూ ఈ వీడియో క్లిప్‌కు రెండు లక్షలకు పైగా వ్యూస్ దక్కాయి.