వైరల్ వీడియో | లవర్స్ గొడవలో తలదూర్చి రచ్చరచ్చ చేశాడు!
లవర్స్ మధ్య గొడవలో తలదూర్చిన ఫుడ్ డెలివరీ బాయ్ రచ్చరచ్చ చేశాడు. బాయ్‌ప్రెండ్‌ను దూషించిన బాలికను తీవ్రంగా కొడుతున్న ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భువనేశ్వర్ : లవర్స్ మధ్య గొడవలో తలదూర్చిన ఫుడ్ డెలివరీ బాయ్ రచ్చరచ్చ చేశాడు. బాయ్‌ప్రెండ్‌ను దూషించిన బాలికను తీవ్రంగా కొడుతున్న ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒడిషాలోని భువనేశ్వర్‌లో మంగళవారం ప్రజలు చూస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందిరా గాంధీ పార్క్ నుంచి బయటకు రాగానే బాయ్‌ఫ్రెండ్‌తో బాలిక గొడవ పడుతోంది.
వైరల్ వీడియోలో బాలిక బాయ్‌ఫ్రెండ్‌ను దూషిస్తూ కొడుతుండటం కనిపించింది. ఆపై బాయ్ఫ్రెండ్పైకి రాయి విసిరింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న వారు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేశారు. గొడవపడుతున్న లవర్స్‌కు సర్ధిచెప్పేందుకు ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ జోక్యం చేసుకున్నాడు.
బాలికకు సర్దిచెబుతుండగా అతడిపైనా పరుష పదజాలంతో విరుచుకుపడింది. దీంతో సహనం కోల్పోయిన డెలివరీ బాయ్ ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ ఘటనపై బాలిక, ఫుడ్ డెలివరీ బాయ్ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భువనేశ్వర్ డీసీపీ ఉమాశంకర్ స్పందించారు. గొడవకు దిగిన బాలిక, ఫుడ్ డెలివరీ బాయ్ ఇద్దరిపై కేసు నమోదు చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించానని తెలిపారు.
Food Delivery boy who tried to intervene and pacify the matter, losses his cool after scolded by the girl, started beating the girl.
Case registered against both parties#Odisha @aajtak @IndiaToday pic.twitter.com/DqINUglqH0— SUFFIAN (@iamsuffian) March 31, 2022
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

