Chicken 65 | ఏదైనా హోటల్‌కు వెళ్లి బిర్యానీ తినాలన్నా.. ఇంకేదైనా తినాలన్నా.. ముందు స్టార్టర్‌గా చాలామంది ఆర్డర్ ఇచ్చేది కూడా చికెన్ 65నే. అయితే.. అసలు చికెన్ 65కి ఆ పేరు ఎలా వచ్చింది.
దానికి 65 అనే పేరు ఎందుకు పెట్టారు. 75 అని ఎందుకు పెట్టలేదు. 50 అని ఎందుకు పెట్టలేదు.. 100 అని ఎందుకు పెట్టలేదు అనే డౌట్స్ చాలామందికి వచ్చే ఉంటుంది కానీ.. దానికి సరైన సమాధానం మాత్రం చాలామందికి తెలియదు.
అసలు.. చికెన్ 65కి ఎందుకు ఆ పేరు వచ్చిందో ఇన్‌స్టాగ్రామ్‌లో రౌనక్ రామ్టెకే అనే వ్యక్తి ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ఏం చెప్పుకొచ్చాడంటే.. చికెన్ 65ను చెన్నైలోని బుహారి హోటల్లో 1965తో మొదటి సారి తయారు చేశారట. 1965 లో తొలిసారి చేశారు కాబట్టి.. దానికి చికెన్ 65 అనే పేరును పెట్టారట. ఏఎం బుహారి అనే వ్యక్తి 1951లో ఆ హోటల్‌ను ప్రారంభించాడు. వాళ్లే తొలిసారి చికెన్ 65 వంటకాన్ని తయారు చేశారు.. అసలు విషయాన్ని వీడియోలో చెప్పుకొచ్చాడు రౌనక్.
ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. హమ్మయ్య.. ఇప్పటికి చికెన్ 65 అసలు రహస్యం తెలిసిపోయింది. ఒక మంచి విషయం చెప్పారు.. థ్యాంక్స్ అంటూ నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.