హైదరాబాద్: సాధారణంగా పిల్లిని చూస్తే ఏ పక్షి అయినా గడగడ వణికిపోతుంది. పిల్లి కనిపించిందంటే చాలు ఆమడ దూరం పారిపోతుంది. కానీ ఈ కింది వీడియోలో మాత్రం అందుకు భిన్నమైన దృశ్యం ఉంది. ఓ చిలుక పిల్లికూనకు చుక్కలు చూపించింది. చిలుక మీదమీదకు వచ్చినా కొద్దీ పిల్లి వెనక్కి వెనక్కి వెళ్లి నక్కింది. చిలుక తనకు ఏ హాని చేస్తుందోనన్న భయంతో పారిపోయేందుకు విశ్వ ప్రయత్నమే చేసింది. కానీ అందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో భయంభయంగానే చిలుకపై గట్టిగా పంజా విసిరింది. ఆ దెబ్బకు అప్పటిదాకా పిల్లితో చెలగాటమాడిన చిలుక తుర్రుమని పారిపోయింది. ఈ నవ్వు తెప్పించే దృశ్యాన్ని మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి.