బీజింగ్ : చైనాలోని హుబే ప్రావిన్స్‌కు చెందిన వధువు పెండ్లి మంటపాన తన భర్త బహుకరించిన 60 కిలోల బంగారం ధరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సెప్టెంబర్ 30న జరిగిన ఆమె పెండ్లి వేడుకలో బరువైన బంగారు ఆభరణాలు ధరించిన వధువు పెండ్లికి వచ్చిన అతిధులు, నెటిజన్లను కట్టిపడేసింది. తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ధరించి తన చేతిలో గులాబీలు పట్టుకుని ఒంటి నిండా నగలతో ఆమె ముస్తాబైంది.
ఒక్కోటి కిలో బరువున్న 60 బంగారు నెక్లెస్‌లను పెండ్లికొడుకు ఆమెకు కానుకగా అందించాడు. వాటికి తోడు ఆమె రెండు చేతుల నిండా బంగారు గాజులు ధరించింది. పెండ్లికొడుకు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో వధువును బంగారు ఆభరణాల్లో ముంచెత్తాడు. ఇక పెద్దసంఖ్యలో గోల్డ్ నెక్లెస్‌లు, బంగారు గాజులతో వధువు కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.