రూ 5కే పోహాతో ఆకలి తీరుస్తున్న బామ్మ!

ముంబై : జీవనోపాధికి ఒక్కొక్కరు ఒక్కో వృత్తిని ఎంచుకుంటారు. ఓ వయసు వచ్చాక పిల్లలు, మనవళ్లతో కాలక్షాపం చేస్తుంటారు. కానీ 65 ఏండ్లలోనూ విసుగూ, విరామం లేకుండా మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన ఓ బామ్మ పని చేస్తూనే ఉన్నారు. రూ 5కే పోహా విక్రయిస్తూ జనాల ఆకలి తీర్చడంతో పాటు తన బతుకుబండినీ లాగిస్తున్నారు. ధీర్, తాఖీర్ అనే ఫుడ్ బ్లాగర్లు నాగపూర్‌లోని భరత్‌మాత చౌక్ సమీపంలో టీబీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న బామ్మ పోహా స్టాల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
రూ 5కే పోహాను అమ్ముతూ ఆమె పొట్టపోసుకుంటోంది. 15 ఏండ్ల కిందట భర్త మరణించినప్పటి నుంచి ఆమె పోహా అమ్ముతూ ఒంటరిగా బతుకీడుస్తోందని ఆమెకు సాయం చేయండని కోరుతూ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. వీడియో క్లిప్‌ను ఇప్పటివరకూ 2.35 లక్షల మంది వీక్షించారు. బామ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడిన నెటిజన్లు ఆమె స్టాల్‌ను తప్పకుండా సందర్శిస్తామని మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

