జోహన్నెస్‌బర్గ్, జూలై 5, 2026 : మహానేత, మాజీ ముఖ్యమంత్రి, దివంగత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతిని దక్షిణాఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా (YSRCP NRI South Africa) ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లోని మిడ్రాండ్లో వైఎస్సాకర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ చిత్రపటానికి సుమాంజలి ఘటించారు. అనంతరం పలువురు నాయకులు, సభ్యులు వైఎస్సార్ ప్రజాసేవను గుర్తు చేసుకున్నారు.
వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కేక్ కట్ చేశారు. సీఎంగా వైఎస్సార్ అందించిన సంక్షేమ పాలనను కొనియాడుతూ.. రైతులు, పేదలు, విద్యార్థులు,మహిళల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రసంగించారు. వైఎస్సార్ ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పేందుకు, ఆయన సేవా స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు తెలిపారు.
అనంతరం అందరూ కలిసి భోజనం చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బీ. వెంకట సుబ్బారెడ్డి, వాసు సింగారెడ్డి, వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఏనుముల, కృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ, కల్పన జోసెఫ్, శివ మోహన్ రెడ్డిలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.