“వంశీ ఆర్ట్ థియేటర్స్ – ఇంటర్నేషనల్” ఇండియా, “శుభోదయం” గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై శనివారం “స్వర్ణ వంశీ – శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారాలు 2022” కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల నుంచి 37 మంది మహిళామణులు ఈ అవార్డుకు ఎంపికయ్యారని వ్యవస్థాపకుడు డాక్టర్ వంశీ రామరాజు తెలిపారు. 50 ఏళ్ల వంశీ సంస్థలు ఈ ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకోబోతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా.. అంతర్జాతీయంగా సాహిత్య, సంగీత, సాంస్కృతిక, సేవా రంగాలలో రాణిస్తున్న వివిధ దేశాల్లో ఉన్న తెలుగు మహిళల కృషి, సేవలకు గుర్తిస్తూ ఈ పురస్కారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ప్రముఖ సినీకవి భువనచంద్ర, శుభోదయం చైర్మన్ డాక్టర్ కలపటపు లక్ష్మీప్రసాద్, సింగపూర్ నుంచి కవుటూరు రత్నకుమార్, తదితరులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలను అభినందించారు. రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వహణలో ప్రత్యేకమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. భువనచంద్ర ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని, పురస్కార విజేతల పేర్లను జతపరచి చక్కటి పాటను రాశారు. బాణి కూర్చి పాడి వినిపించడంతో అందరూ చాలా ఆనందించారు.
అవార్డు గ్రహీతలు వీరే..
రాధిక మంగిపూడి, కాత్యాయని గణేశ్న(సింగపూర్), శ్రీలత మగతల, డా పద్మ మల్లెల (న్యూజిలాండ్), విజయ గొల్లపూడి, రమ కంచిభొట్ల (ఆస్ట్రేలియా), బొంతల శ్రీలక్ష్మీ రమేశ్‌బాబు (యుగాండా), జయ పీసపాటి (హాంకాంగ్), సత్యాదేవి మల్లుల (మలేషియా), దీపిక రావి (సౌదీ అరేబియా), ఫణి కళ్యాణి కొండూరు, రాజారమా పద్మజ ఉసిరికల, వర్ధని దేవి పాలగిరి, శ్రీవాణి అరికరేవుల (ఖతార్), శ్రీదేవి దాచేపల్లి (ఒమన్), డా. భారతి చాపరాల, కందుకూరి భారతి, వింజమూరి రాగసుధ (యూకే), వడ్డాది రవళి (ఫిన్లాండ్), రమ్యకృష్ణ (నెధర్లాండ్స్), సాయి స్వాతి గురయ్య (మారిషస్), శ్రావణిరెడ్డి పెట్లూరు (దక్షిణాఫ్రికా), సుధ కామేశ్వరి వేమూరి (కెనడా), లలితా రామ్, డా. శారదా పూర్ణ శొంఠి, శారద కాశీవజ్ఝల,
మణిశాస్త్రి, రాధిక నోరి, డా. నాగేశ్వరి కృష్ణారెడ్డి, తేలుకుంట్ల జయశ్రీ, శ్రీదేవి జాగర్లమూడి, గుణసుందరి కొమ్మారెడ్డి, రాధ కాశీనాథుని, శారదా సింగిరెడ్డి, సుజాత వెంపరాల, మంజు భార్గవ, రమా కుమారి వనమా (అమెరికా).