TPAD | అమెరికాలోని తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) మరోసారి తన ఉదారతను చాటుకుంది. గత 11 ఏండ్లుగా పండుగలు, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న టీపాడ్ తాజాగా 15వ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. డీఎఫ్‌డబ్ల్యూ మెట్రో ఏరియాలోని ఐటీ స్పిన్ కంపెనీ ప్రాంగణంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. 85 మంది నుంచి 60 పింట్ల రక్తాన్ని సేకరించింది. ఒక్కో పింట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని రక్త సేకరణ సంస్థ కార్టర్ బ్లడ్ కేర్ తెలిపింది.
ఫ్రిస్కో, అల్లెన్, మెక్ కిన్నీ , ప్రాస్పర్, ప్లేనో, ఇర్వింగ్, కొప్పెల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన రక్తదాతలు, కార్టర్ బ్లడ్‌కేర్ సిబ్బందితో పాటు వలంటీర్లు అందరికీ టీపాడ్ సంస్థ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లంచ్ ఏర్పాటు చేసింది. ఈ డ్రైవ్‌ను రవి చెన్నూరి, స్వప్న గొల్లపల్లి కోఆర్డినేట్ చేశారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), పాండు రంగారెడ్డి పాల్వాయి (బీవోటీ చెయిర్), రావు కల్వల (ఎఫ్‌సీ చెయిర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్) గైడ్ చేశారు. టీపాడ్ బృందం సభ్యులు, స్థానిక పాఠశాలల నుంచి కొందరు విద్యార్థులు సహకారం అందించారు. కార్యక్రమం విజయవంతానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి టీపాడ్ ధన్యవాదాలు తెలిపింది.
Tpad2