Diwali Celebrations | బందర్ సెరి బేగావాన్ : బ్రూనై దారుస్సలాం తెలుగు సంఘం దీపావళి పండుగను దాతృత్వ, సేవా కార్యక్రమాలతో అర్థవంతంగా జరుపుకుంది. విల్లేజ్ పందాన్ బి ప్రాంతంలోని పాదచారుల మార్గంలో సంఘం సభ్యులు స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏడు ట్రక్కుల వ్యర్థాలను సేకరించి, వాటిని టెలిసాయ్ రీస్లైకింగ్ సెంటర్కు తరలించింది.
ఈ స్వచ్ఛత కార్యక్రమానికి సోము నాయుడు దాది, సతీశ్ పొలమత్రసెట్టి నాయకత్వం వహించగా, రమేశ్ బాబు బదరవూరి, చింత వేంకటేశ్వరరావు మద్దతు అందించారు. పనగా బి గ్రామాధ్యక్షుడు మహమ్మద్ రవియాని బిన్ మోర్నీ నేతృత్వంలోని MPK బృందం సహకారం అందించింది. స్వచ్ఛత కార్యక్రమంతో పాటు సంఘం సభ్యులు రిపాస్ హాస్పిటల్లోని బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా సభ్యులు పాల్గొనగా, 24 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమానికి నవీన్ కుమార్ సురపనేని సమన్వయం చేశారు.

Brunei2
ఈ సేవా కార్యక్రమాలకు భారత రాయబారి హిజ్ ఎక్సలెన్సీ రాము అబ్బగాని, శ్రీమతి పుష్ప అబ్బగాని హాజరై, సభ్యులను అభినందింంచారు. సేవా కార్యక్రమాల పట్ల ప్రశంసలు తెలిపారు.

Brunei3
తెలుగు సంఘం అధ్యక్షుడు వెంకట రమణ రావు సూర్యదేవర మాట్లాడుతూ.. “దీపావళి పండుగ ఆత్మీయత, వెలుగు.. దాతృత్వానికి ప్రతీక. సమాజానికి సేవ చేయడం, శుభ్రతా కార్యక్రమాలు మరియు రక్తదానం వంటి చర్యలు ఈ పండుగను మరింత అర్థవంతంగా మారుస్తాయి. సభ్యుల ఉత్సాహం, సేవా మనసు సంఘానికి గర్వకారణం,” అని తెలిపారు.

Brunei4

Brunei5