Diwali 2024 | తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పండుగలో తెలుగువారి సంప్రదాయాలు, సాంస్కృతిక పరంపరలు అత్యంత ఘనంగా ప్రదర్శించారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ.. తదుపరి తరాలకు అందిస్తూ.. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఈ దీపావళి వేడుకల్లో పాల్గొని తమ ఆనందపు వెలుగులను పంచుకున్నారు.
ఈ వేడుకలో భాగంగా సంప్రదాయ పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పూలమాలల అలంకరణలు, దీపాల అలంకరణలు వంటి సంప్రదాయ కార్యకలాపాలు నిర్వహించారు. పిల్లలు పటాకులు కాలుస్తూ, పెద్దలు మిఠాయిలను పంచిపెడుతూ, ఈ పండుగను సమైక్యతగా జరిపారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన “కమిటీ కుర్రోళ్ళు” నాటకం మరొక్కసారి తెలుగు వారందరూ కడుపుబ్బా నవ్వుకునేలా చేసింది. కార్యక్రమం ఆద్యంతం హృద్యంగా సాగింది. చివరగా షడ్రుచులతో కూడిన దీపావళి విందుతో వేడుకలు ముగించారు.
Singapore Diwali1
Singapore Diwali2
Singapore Diwali3
Singapore Diwali4
Singapore Diwali6