TPAD | తెలంగాణ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) 2025 నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార వేడుక ఘనంగా జరిగింది. అమెరికా టెక్సాస్‌లోని ప్లాన్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన ఎలిగెన్స్ బాల్రూమ్లో ఈ వేడుక జరిగింది. 2025లో TPAD చేయబోయే సమాజ సేవ, సాంస్కృతిక సుసంపన్నతను కాపాడే మిషన్‌కు బాధ్యత వహించే నాయకులు, కమిటీలను ప్రకటించారు.
ఈ ప్రమాణ స్వీకార వేడుకను కోఆర్డినేటర్లు రత్న ఉప్పాల, రేణుక చనుమోలు తమ ఆత్మీ య స్వాగత ప్రసంగంతో ప్రారంభించారు. అనంతరం TPAD నాయకత్వ బృందం జ్యోతిప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా అమెరికా, భారత దేశ జాతీయ గీతాలను ఆలపించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్:
నూతన కార్యవర్గానికి అనురాధ మేకల అధ్యక్షత వహించనున్నారు. ఈ బృందంలో రూపాదేవి కన్నయ్యగారి ( మాజీ అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని, లక్ష్మీ పోరెడ్డి, శ్రీధర్ వేముల, స్వప్న తుమ్మపాల, గాయత్రి గిరి, చక్రధర్ నారా, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నామని, దీపికా రెడ్డి, అనూష వనం, రవి చెన్నూరి, సంతోశ్ రేగొండ, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
ఆఫీస్ బేరర్లు :
ఈ వేడుకలో ప్రెసిడెంట్‌గా అనురాధ మేకల, వైస్ ప్రెసిడెంట్‌గా రత్న ఉప్పాల, జనరల్ సెక్రటరీగా బాల గణవరపు, జాయింట్ సెక్రటరీగా రేణుక చనుమోలు, ట్రెజరర్‌గా శివ కొదిత్యాల, జాయింట్ ట్రెజరర్‌గా ఆదిత్య గాదె ప్రమాణస్వీకారం చేశారు.
నిర్వాహక మండలి సభ్యులుగా పాండురంగా రెడ్డి ( అధ్యక్షులు), రవికాంత్ మామిడి (ఉపాధ్యక్షులు), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), సుధాకర్ కలసాని, రోజా ఆడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాది, పవన్ గంగధార, అశోక్ కొండల, రణపాల్ గడ్డం, సత్య పెరికారి, లింగారెడ్డి ఆల్వా, జానకీరామ్ మందాడి ప్రమాణస్వీకారం చేశారు.
ఫౌండేషన్ కమిటీ చైర్మన్‌గా రావు కాల్వల, వైస్ చైర్మన్‌గా రఘువీర్ బండారు, సలహాదారులుగా గోలి బుచ్చిరెడ్డి, చంద్ర పోలీస్, ఇంద్రాణి పంచెరుపుల, ఇందూరెడ్డి మందాడి, లోకేశ్ నాయుడు, మాధవి లోకిరెడ్డి, మనోహర్ మోతూరి, రాజేంద్ర మాదాల, రమణ రెడ్డి కృష్టపాటి, వెంకట రమణారెడ్డి మురారి, వేణు భాగ్యనగర్, విజయ్ తొడుపునూరి, విక్రమ్ జనగాం ప్రమాణం చేశారు.
ఈ వేడుకలో భాగంగా 2024 ఏడాదికి సంబంధించిన కార్యవర్గాన్ని సత్కరించారు. గత కార్యవర్గ అధ్యక్షురాలు రూపా కన్నయ్యగారి, ఫౌండేషన్ కమిటీ ఛైర్మన్ జానకిరామ్ మందాడి, BOT ఛైర్మన్ గోలి బుచ్చి రెడ్డి, సమన్వయకర్త రవికాంత్ మామిడి తదితరులు తమ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. నూతన కార్యవర్గానికి తమ సలహాలను అందజేశారు.
ఈ సందర్భంగా టీపీఏడీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అజయ్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త కమిటీ తెలంగాణ ప్రవాసుల మధ్య ఐక్యతతో పాటు సాంస్కృతిక పరిరక్షణ, సమాజ సేవను పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీఏడీ నూతన కార్యవర్గ విజయానికి, సమాజ శ్రేయస్సు కోసం పూజారి శ్రీనివాసాచార్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.