Minister Errabelli | దాజీ (కమలేష్ పటేల్ )తో పరిచయం అదృష్టం అని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రస్తుతం ఆటా మహాసభల కోసం అమెరికాలో పర్యటిస్తున్న ఎర్రబెల్లి శుక్రవారం ప్రపంచ ఆరాధ్య హార్ట్ఫుల్నెస్ ప్రచారకర్త కమలేష్ పటేల్ (దాజీ)తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… దాజీ తో పరిచయం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అలాగే దాజీ స్పూర్తితో తెలంగాణలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు. రాజకీయాల్లో ఉండటం వల్ల యోగ చేయడం లేదన్నారు. దాజీ స్పూర్తితోనైనా యోగ చేయడానికి ప్రయత్నిస్తానన్నారు.