ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన సింగపూర్ కవుల కవితా పటిమ
తానా | ఉగాది సందర్భంగా 21 దేశాల తెలుగు సంస్థల సమన్వయంతో అమెరికా "తానా" వారు నిర్వహించిన "ప్రపంచ తెలుగు మహా కవి సమ్మేళనం"లో తొలి వేదికలో "శ్రీ సాంస్కృతిక

సింగపూర్ : ఉగాది సందర్భంగా 21 దేశాల తెలుగు సంస్థల సమన్వయంతో అమెరికా “తానా” వారు నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహా కవి సమ్మేళనం”లో తొలి వేదికలో “శ్రీ సాంస్కృతిక కళాసారథి”, సంస్థ సింగపూర్ కు ప్రాతినిధ్యం వహిస్తూ, సింగపూర్ తెలుగు కవుల ప్రతిభాకేతనాన్ని ఎగురవేసింది.
సింగపూర్ వాస్తవ్యులైన పదిమంది కవులు, కవయిత్రులు తమ చక్కటి కవితలతో, ఛందోబద్ధమైన పద్యాలతో, గేయాలతో ప్రేక్షకులందరినీ అలరించారు. రాధిక మంగిపూడి కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రఖ్యాత సినీ రచయిత భువనచంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని సింగపూర్ తెలుగు కవులకు ప్రోత్సాహిస్తూ ప్రతి కవితను ఆస్వాదిస్తూ తమ అమూల్యమైన వ్యాఖ్యానాన్ని అందించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వారు రచించిన ఒక పాటను స్వరపరిచి పాడి వినిపించడం అందరినీ అలరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య సూర్య ధనుంజయ్ విశిష్ట అతిథిగా పాల్గొని కవులకు తమ విలువైన అభినందనలను అందించారు.
“శ్రీ సాంస్కృతిక కళాసారథి” అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ.. “ఇంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమంలో తమ సంస్థ, సింగపూర్ కు ప్రాతినిధ్యం వహించడం తమకు ఆనందంగా ఉందని, తానా నిర్వాహకులు తాళ్లూరి జయశేఖర్, చిగురుమళ్ళ శ్రీనివాస్, తోటకూర ప్రసాద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కొందరు ఔత్సాహిక రచయితలుగా తొలిసారి కవితాపఠనం చేసినవారు కూడా ఉన్నప్పటికీ తొలి ప్రయత్నంలోనే పెద్దల మెప్పును పొందడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటువంటి కార్యక్రమాలు ప్రవాసాంధ్ర రచయితలలో నూతన ఉత్సాహాన్ని నింపి తెలుగు సాహిత్య పరంపర కొనసాగేందుకు దోహదం చేస్తుందని “శ్రీ సాంస్కృతిక కళాసారథి” నిర్వాహక వర్గం అభిప్రాయం వ్యక్తం చేశారు.
కవులుగా రాధాకృష్ణ రేగళ్ళ ,గుడిదేని వీరభద్రయ్య, ఓరుగంటి రోజారమణి, సుబ్బు వి పాలకుర్తి , యడవల్లి శేషు కుమారి, ఊలపల్లి భాస్కర్, మల్లవరపు వేణుమాధవ్, శైలజ శశి ఇందుర్తి, శ్రీనివాస్ జాలిగామ పాల్గొనగా రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం, eRemit (శ్రీహరి శిఖాకొల్లు)వారు, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ఆర్ధిక సమన్వయం అందించారు. ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని సింగపూర్ భారత్-అమెరికా మొదలగు అన్ని దేశాల వారు వీక్షించి వారి అభినందనలు తెలియజేశారు.
పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Singapore
- TANA
- Telugu Poets
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

