అమెరికాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం
సిలికానాంధ్ర | అమెరికాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అగ్రరాజ్యంలో భారతీయ సంగీతం, డ్యాన్స్, భాషలను విద్యార్థులకు అందిస్తున్న సిలికానాంధ్ర వర్సిటీని

న్యూయార్క్: అమెరికాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అగ్రరాజ్యంలో భారతీయ సంగీతం, డ్యాన్స్, భాషలను విద్యార్థులకు అందిస్తున్న సిలికానాంధ్ర వర్సిటీని 2016లో కాలిఫోర్నియాలో ప్రారంభించారు. కొత్తగా శాన్వాకిన్ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణంలో మరో క్యాంపస్‌ను నిర్మాణాన్ని చేపట్టారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిలికాన్ వ్యాలీకి సమీపంలో నూతన క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు.
వర్సిటీ నిర్మాణానికి అవసరమైన 67 ఎకరాల భూమిని సంధు కుటుంబం ఇవ్వనుందని వర్సిటీ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ అన్నారు. అందరి మన్నలను, సహకారాన్ని పొందిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్థానికంగా, దేశవ్యాప్తంగా విభిన్న రంగాల అభివృద్ధికి విద్యను అందిస్తుందన్నదని చెప్పారు. స్థానికంగా ఉండే అట్టడుగువర్గాల అభివృద్ధికి తోడ్పడుతూ స్పష్టమైన ప్రణాళికతో, ఉన్నతస్థాయిలో పరిశోధనాత్మకమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా శాన్ వాకిన్ జిల్లా యువత అనేక రకాలుగా లబ్ధి పొందుతారని సంధు కుటుంబసభ్యులు మైక్ సంధు, మణి సంధు ఆశాభావం వ్యక్తం చేశారు.
శాన్ వాకిన్ జిల్లా సామాజిక, ఆర్థిక అభివృద్ధికై సహయపడే విద్యాప్రణాళికను రూపొందిస్తామని ప్రొవోస్ట్ చమర్తి రాజు అన్నారు. ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, భాషాశాస్త్రాలు, యోగ, ఆయుర్వేద, సంగీత నృత్య కళలలో BS/MS/MA, Ph.D. డిగ్రీలను అందించే అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయంగా రూపొందబోతున్నదని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివరాలు https://www.uofsa.edu వెబ్సైట్లో లభిస్తాయని వర్సిటీ టెక్నాలజీ డైరెక్టర్ ఫణి మాధవ్ కస్తూరి తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

