హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్(Phone tapping) కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌పై సిట్ దర్యాప్తును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రతీకార చర్య అని డెన్మార్క్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు శ్యాం ఆకుల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాల పాలనతో పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకోవడం దుర్మార్గం అన్నారు. ప్రజా ససమ్యలపై ఉద్యమిస్తున్న బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కేసులో ఏమీ లేదని సుప్రీం కోర్టు చెప్పినా కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైందని, విపక్షాన్ని అణచివేయాలనే దురుద్దేశంతో చేస్తున్న చర్యగా అభివర్ణించారు. జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడు అని కొనియాడారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని, మేమంతా సంతోష్ కుమార్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు.