NTR | విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీ.శే. నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా నార్వేకు చెందిన `వీధి అరుగు` అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఆన్లైన్ మీట్ జరుగుతున్నది. ఈ ఆన్లైన్ మీట్ 40 దేశాలలోని 100 పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు.
`💯 “శకపురుషుని శతవసంతాలు“ 💯` అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ నెల 27న అంటే శనివారం ఉదయం 8:00 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల వీక్షకులు ఈ కార్యక్రమాన్ని https://www.youtube.com/watch?v=egLQZjdjyEE లింక్లో వీక్షించవచ్చు.
14 గంటలపాటు నిర్విరామంగా, అంతర్జాల వేదికపై జరిగే ఈ అపురూపమైన కార్యక్రమాన్ని వీక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటున్నాం అని `వీధి అరుగు` నిర్వాహకులు వెంకట్ తరిగోపుల తెలిపారు.
ఈ నెల 28 నాటికి ఎన్టీఆర్ జన్మించి శత వసంతాలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మహానీయుడ్ని ప్రత్యేకంగా స్మరించుకునేందుకు ఇంటర్నెట్ వేదికగా ఈ నెల 27న ఈ ఆన్లైన్ మీట్ నిర్వహిస్తున్నామని వెంకట్ తరిగోపుల తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులతోపాటు అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు.