హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఎన్నారైలతో జరిగిన జూమ్ సమావేశం విశేషాలను ప్రగతి భవన్లో టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు వివరించారు.
సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించే దిశాగా అడుగులు వేయాలని చేసిన తీర్మానాన్ని ప్రపంచ వ్యాప్తంగా వున్న ఎన్నారైలు అందరూ ముక్త కంఠంతో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారని వివరించారు.
అలాగే మహేష్ బిగాల రానున్న రెండు వారాల తన యూరప్ పర్యటనను కేటీఆర్‌కు వివరించారు. యూరప్‌లోని వివిధ దేశాలలో అన్ని రాష్టాల ప్రతినిధులని కలిసి దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్రపై వివరిస్తామన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మహేష్ బిగాలను అభినందించారు.