CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా మూడోసారి
ప్రమాణస్వీకారం చేసేది కేసీఆరేనని ఎన్నారైలు స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు మద్దతుగా
యూఎస్ఏ విభాగం ఆధ్వర్యంలో అమెరికా డెలవేర్లో ‘We want KCR’ నినాదంతో టెస్లాలైట్ షోను
నిర్వహించారు. బీఆర్ఎస్ యూఎస్ఏ విభాగం కో ఆర్డినేటర్ తన్నీరు మహేశ్ ఆధ్వర్యంలో పిన్నా భాస్కర్
నేతృత్వంలో డెలవేర్‌లోని చార్లెస్ ఈ ప్రైమ్ మెమోరియల్ పార్క్‌లో ‘గులాబీ జెండలే రామక్క’ పాటతో
కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ We want KCR.. We want CM’
నినాదంతో వినూత్నంగా టెస్లాటైట్షోను నిర్వహించినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ
దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని కొనియాడారు.
ఎన్నారైలంతా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు.