Ganesh Immersion : గణేష్ నవరాత్రి ఉత్సవాలను సింగపూర్‌లోని తెలంగాణ వాసులతో కలిసి కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆఖరు రోజున చిట్ల విక్రం ఉష (Chitla Vikram Usha) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం నిమజ్జన వేడుకలను ఘనంగా, సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.
వినాయకుడి ప్రతిమను భక్తిపూర్వకంగా నిమజ్జనానికి తీసకెళ్లారు. అనంరతం సముద్ర తీరం వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ వేడుకల్లో తెలంగాణకు చెందిన చిట్ల విక్రం, విజయ్, చిట్టపల్లి మహేష్, చల్ల కృష్ణ, ఐటీ విజయ్, మహేష్, స్వామి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వినాయక నిమజ్జనం వేడుకల్లో భాగంగా..