Somasegar | అమెరికాలో భారత సంతతి సీనియర్ టెకీ ఆకస్మిక మృతి
Somasegar | అగ్రరాజ్యం అమెరికా (USA) లో భారత సంతతి (Indian-Origin) కి చెందిన సీనియర్ టెకీ సోమ సోమసేగర్ (S Somasegar) కన్నుమూశారు. సియోటెల్కు చెందిన వెంచర్ క్యాపిటల్ (Venture Capital) సంస్థ మద్రోనా వెంచర్ గ్రూప్ (Madrona Venture Group) కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఆకస్మికంగా మరణించారు.
Somasegar : అగ్రరాజ్యం అమెరికా (USA) లో భారత సంతతి (Indian-Origin) కి చెందిన 59 ఏళ్ల సీనియర్ టెకీ సోమ సోమసేగర్ (S Somasegar) కన్నుమూశారు. సియోటెల్కు చెందిన వెంచర్ క్యాపిటల్ (Venture Capital) సంస్థ మద్రోనా వెంచర్ గ్రూప్ (Madrona Venture Group) కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఆకస్మికంగా మరణించారు. మద్రోనా వెంచర్ గ్రూప్ ఈ విషయాన్ని వెల్లడించింది. సోమసేగర్కు నివాళులు అర్పించింది. అయితే సోమసేగర్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పుదుచ్చేరిలో జన్మించిన సోమసేగర్ మైక్రోసాఫ్ట్‌లో దాదాపు మూడు దశాబ్దాలపాటు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2015లో మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగిన ఆయన.. మద్రోనా వెంచర్ గ్రూప్‌లో ఎండీగా చేరారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు స్టార్టప్ కంపెనీల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి. కాగా సోమసేగర్ మరణవార్తకు కొన్ని గంటల ముందే.. 2026 సంవత్సరానికిగాను ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టర్లను గుర్తించే SEED 100 జాబితాలో సోమసేగర్కు చోటుదక్కింది.
సోమసేగర్ ఆకస్మిక మరణంపై టెక్ పరిశ్రమలోని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనకు నివాళులర్పిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఏఐ సలహాదారుగా ఉన్న భారత సంతతికి చెందిన శ్రీరామ్‌కృష్ణన్ కూడా సోమసేగర్కు నివాళులు అర్పించారు. తన కెరీర్లో సోమసేగర్ పాత్ర కీలకమంటూ ఎక్స్‌లో భావోద్వేగమైన పోస్టు పెట్టారు. ఇక మైక్రోసాఫ్ట్‌లోని పలువురు మాజీ సహ ఉద్యోగులు కూడా సంతాపం తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

