సాధారణ ఆర్థిక ( India Economy ) వ్యవస్థ నుంచి ప్రపంచంలోని టాప్ ఫైవ్‌లో ఒకటిగా భారత్ ఎదగడం, దిగుమతులపై ఆధారపడే స్థాయి నుంచి ఎగుమతుల్లో శక్తివంతమైన దేశంగా భారత్ మారుతుందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ( Minister Satyakumar Yadav ) అన్నారు.
సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో ఆయన ఆదివారం సెంగ్కాంగ్లోని లా ఫియెస్టా కాండోమినియంలో ప్రవాస తెలుగు సభ్యులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం సభ్యులతో ముఖాముఖీలో పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ భారత్ సంక్షోభాలను ఎదుర్కొనే స్థితి నుండి అవకాశాలను సృష్టించే స్థితికి చేరడం వంటి అంశాలను వివరించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతదేశ దృష్టి, పురోగతి, ఆకాంక్షలతో ఉన్న బలమైన అనుబంధాన్ని ఈ అనుభవం ప్రతిబింబిస్తుందని తెలిపారు. .జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతం నుంచి 7-8 శాతానికి కి పెరిగినట్లు వివరించారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ 50 నుంచి 15 లక్షలకు విస్తరించి, 125 యూనికార్న్‌లు ఏర్పడ్డాయని పేర్కొన్నారు . ద్రవ్యోల్బణం 2శాతంతగ్గినట్లు వివరించారు.
సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ప్రవాస తెలుగు వారి కోసం సమయం కేటాయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాంబాబు పాతూరి, చామిరాజు రామాంజనేయులు , ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ నిట్టల, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షుడు రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు గుత్తుల రవికుమార్, వేణు మల్లవరపు, సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి, దాములూరి భరత్, వెంకట్ భీమినేని, యోగి బూరుగపల్లి, రాధాకృష్ణ గణేశ్, సురేంద్ర చేబ్రోలు తదితరులు పాల్గొన్నారు.