హైదరాబాద్ : రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనిల్ కుర్మాచలం, రాష్ట్ర రెడ్కో చైర్మన్‌గా వై సతీశ్ రెడ్డి నియమించబడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరికి ఎన్నారై టీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో సముచిత స్థానం కల్పిస్తారనడానికి అనిల్‌కు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడమే నిదర్శనమని చెప్పారు. అనిల్‌కు కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు గుర్రాల నాగరాజు ఎన్నారై టీఆర్ఎస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు.