London | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో రాష్ట్రాన్ని 20 ఏండ్ల వెనక్కి తీసుకెళ్లిందని అన్నారు. ఎన్నారై టీబీఆర్ఎస్ యూకే కార్యవర్గ సమావేశం లండన్‌లో ఘనంగా జరిగింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఏర్పాటు చేసి పద్నాలుగు సంవత్సరాలైన సందర్భంగా ముఖ్య నాయకులంతా కేక్ కట్ చేసి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రజల పక్షాన నిలబడి సోషల్‌మీడియా వేదికగా నిలదీయాలని ఎన్నారై కార్యకర్తలకు సూచించారు. అలాగే లండన్‌లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చే ప్రతి పిలుపునకు స్పందించి అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని నిర్ణయించినట్లు ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీబీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ రెడ్డి సమక్షంలో మహబూబ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సాయిబాబా కోట్ల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సాయిబాబా కోట్ల కల్వకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా పనిచేశాడు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసి లండన్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి.. నేడు అధికారంలోకి వచ్చినప్పుడు అందులో ఉండకుండా.. కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని భావించి బీఆర్ఎస్లో చేరిన సాయిబాబాను అనిల్ కూర్మాచలం అభినందించారు. రానున్న రోజుల్లో వారికి పార్టీ తగిన గౌరవం ఇస్తుందని.. వారి అనుభవాన్ని, నాయకత్వాన్ని కూడా పార్టీ ఉపయోగించుకుంటుందని తెలిపారు. కార్యవర్గ సభ్యుల ఆలోచనలు, సలహాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ సీక్క చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.
బీఆర్ఎస్ యూకేలో చేరిన సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ.. యూకే వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లినా కేసీఆర్, కేటీఆర్ పదేండ్లలో చేసిన ప్రగతిపై మాట్లాడుతుండటం కనిపించిందని అన్నారు. ఇన్నేండ్లు కాంగ్రెస్‌లో ఉండి కేసీఆర్, కేటీఆర్‌ను వ్యతిరేకించినందుకు చాలా బాధపడ్డానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తెలంగాణ ప్రజలకు మేలు జరగాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సాయిబాబా కోట్ల పేర్కొన్నారు.
Nri Brs4
యూకేలో వివిధ వేడుకల్లో పాల్గొన్నప్పుడు ఇప్పటికీ కేసీఆర్, కేటీఆర్ చేసిన ప్రగతి గురించే వివిధ రంగాలకు చెందిన విదేశీయులు ప్రస్తావిస్తున్నారని సీనియర్ నాయకులు గణేశ్ కుప్పలా అన్నారు. తెలంగాణ ఏం కోల్పోయిందో రానున్న రోజుల్లో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. ఉన్నత విద్య కోసం లండన్‌కు వచ్చిన బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు శ్రవణ్ రెడ్డి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ఉద్యమం సమయం నుంచి కూడా ఎన్నారై బీఆర్ఎస్ చేస్తున్న సేవలను చూశానని తెలిపారు.ఇప్పుడు లండన్‌కు వచ్చి అందరితో కలిసి మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎత్తుకుని తెలంగాణ ప్రజల కోసం పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో అదే స్ఫూర్తితో ఇక్కడ ఇచ్చిన ప్రతి బాధ్యతను నిర్వహించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Nri Brs5
ఈ సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, సీక్క చంద్రశేఖర్ గౌడ్, రవి ప్రదీప్ పులుసు, శ్రీధర్ రావు, ప్రవీణ్ వీర, సురేష్ గోపతి, వెంకట్ రెడ్డిదొంతుల, హరినవాపేట్, సతీశ్ రెడ్డి బండ, రవి రేతినేని, గణేశ్ కుప్పాల, శ్రీకాంత్ జెల్లా, సురేశ్ బుడగం, గొట్టెముక్కల సతీశ్ రెడ్డి, రమేష్ ఎసెంపల్లి, అబుజార్, గణేశ్ పాస్తం, మధుసూదన్ రెడ్డి, మల్లా రెడ్డి, ప్రశాంత్ కటికనేని, రామకృష్ణ, రాజేష్ వర్మ, శ్రవణ్ రెడ్డి, సాయి బాబా కోట్ల, అంజన్ రావు, తరుణ్, ఇస్మాయిల్,తదితరులు పాల్గొన్నారు.