తెలంగాణ ( Telangana Culture ) సంస్కృతి ,సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ( Bonalu in Dubai ) ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో ఆదివారం రాస్ అల్ ఖైమా -మత్రి ఫార్మ్స్లో అత్యంత వైభవంగా నిర్వహించారు.

Dubai Bonalu 03
ఈ వేడుకకు యూఏఈలోని దుబాయ్( Dubai) , అబుదాబి,షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ ఖువైన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా తదితర ఎమిరేట్స్ నుంచి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మహంకాళీ అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. ఒగ్గుడోలు మోతలు, పోతురాజుల విన్యాసాలు, జానపద వాయిద్యాలతో ఎడారి నేల తెలంగాణ పల్లె వాతావరణాన్ని ఆవిష్కరించింది.

వేడుకలకు మైత్రి గ్రూప్ వ్యవస్థాపకులు కొత్త జైపాల్ రెడ్డి ( Kotta Jaipal Reddy ) ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తున్న ఈటీసీఏ సభ్యులను అభినందిచారు. ఈడీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్కుమార్ పీచర, అధ్యక్షుడు జగదీష్ రావు మాట్లాడుతూ యూఏఈలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులకు , ముఖ్యంగా విదేశాల్లో జన్మించిన భావితరాలకు తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలను పండుగల గొప్పతనాన్ని పరిచయం చేయడమే ఈటీసీఏ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చివరగా తెలంగాణ వంటకాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఎలిగేటి, ప్రధాన కార్యదర్శి రాణికొట్ల, సంయుక్త కార్యదర్శి శేఖర్ గౌడ్ గుండనేని, కోశాధికారి తిరుమల్ రావు బీరెల్లి, మాజీ అధ్యక్షుడు రాధారపు సత్యం, సీనియర్ సభ్యులు వేంకటేశ్వర్ రావు, ఎస్పీ కస్తూరి, సురేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వినోద్ ఆచారి, రఘు ఎలిగేటి, రాము కందుకూరి, సామ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ పోలంపల్లి, కిరణ్ చెట్టిగారి, సారిక పీచర, మమత కస్తూరి, అన్నపూర్ణ, మౌనిక గౌడ్, మధు కుమార్, వనజ గోగుల, రనీషా, విపుల, స్వప్న, దీపిక, తదితరులు పాల్గొన్నారు .