అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. స్థానిక హిందు దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 3000 మంది తెలుగు వారు పాల్గొన్నారు.
అమెరికాలోని కాన్సాస్ నగరంలో స్థానిక హిందు దేవాలయంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలు
మొదట అమ్మ వారి పూజా కార్యక్రమాన్ని దేవాలయ పూజారి శ్రీనివాసాచారి గారు, TAGKC అధ్యక్షులు నరేంద్ర దూదేళ్ళ దంపతులతో నిర్వహించారు. ఈ సంబరాలను మొదటి నుండి చివరివరకు ఎంతో ఉత్సాహంగా వ్యాఖ్యాత రేణు శ్రీ నడిపించింది.
బతుకమ్మలతో వచ్చిన మహిళలు
ముఖ్యంగా మహిళలు ఎంతో చక్కగా సంప్రదాయ దుస్తులను ధరించి, రంగు రంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి వేడుకలో పాల్గొన్నారు. ఆద్యంతమూ ఎన్నో ఉత్సాహ బరితమైన తెలంగాణ జానపద బతుకమ్మ పాటలకు అందరూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
బతుకమ్మలను నిమ్మజ్జనం చేస్తున్న మహిళలు
బతుకమ్మలు తెచ్చిన వారికి Raffle Tickets ఇచ్చి మధ్య మధ్యలో Rafflesలో గెలిచిన వారికి బహుమతులు అందచేశారు. అంతే కాకుండా చక్కగా చేసిన 8 బతుకమ్మ లకు చీరె లను బహుమతులుగా ఇచ్చారు. బతుకమ్మలను నిమజ్జనం చేశాక చివరగా కమ్మని భోజనం చేసి ఆనందంగా పండుగను ముగించారు.
బతుకమ్మలను నిమ్మజ్జనం చేస్తున్న మహిళలు
ఈ కార్యక్రమంకి సహాయ పడ్డ కార్యకర్తలందరికీ, స్పాన్సర్లకు, TAGKC అధ్యక్షులు నరేంద్ర దూదేళ్ళ, ఉప అధ్యక్షులు చంద్ర యక్కలి, Trust Board Chair శ్రీధర్ అమిరెడ్డి, Executive Committee and Trust Board members కృతజ్ఞతలు తెలిపారు.