ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా(Australia) మెల్బోర్న్ నగరంలోని ఎప్పింగ్ కమ్యూనిటీ హాల్లో ‘దిల్ సే’(Dil Se) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు(Ganesh celebrations) ఘనంగా నిర్వహించారు. మేల తాళాలతో వినాయకుడిని భక్తుల సమక్షంలో ఊరేగించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, నృత్యాలు, పాటల కార్యక్రమాలతో సందడిగా నిర్వహించారు. అశేషంగా హాజరైన భక్తుల సమక్షంలో గణనాథుడిని నిమజ్జనం చేశారు.
విదేశాల్లో కూడా భారతీయ సంస్కృతిని ఎన్నారైలు మరవకుండా ఇటువంటి గొప్ప సంప్రదాయ కార్యక్ర మాన్ని నిర్వహించిన దిల్ సే అధ్యక్షుడు హర్ష రెడ్డి, నిర్వాహకులు సాయి కిరణ్, నిఖిల్, ధరణేశ్, శ్రవణ్, బంటి, శ్రీకర్, నవీన్, ఉమాపతి, సాగర్, శరత్, మోహన్, ప్రజ్జున్, శ్రీకాంత్, వంశీ, తేజేష్, కార్తీక్ లను ప్రజలు అభినందించారు. గణేష్ లడ్డును వేలంలో 10000 డాలర్ల అత్యధిక మొత్తంతో కీర్తన, సూర్య, భాను సొంతం చేసుకున్నారు.