ఖతార్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ ఖతార్ శాఖ స్వాగతిస్తున్నదని బీఆర్ఎస్ ఖతార్ ఉపాధ్యక్షుడు గడ్డి రాజు అన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని భావిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీకి, స్పీకర్‌కు రాజ్యాంగం మీద గౌరవం ఉంటేపార్టీ మారిన 11 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయబోరని ఆశిస్తున్నామన్నారు. పార్టీ మారిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరింత విచారణ అవసరం లేకుండా జాప్యం చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరారు.