BRS | టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించడం భారత రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం పేర్కొన్నారు. ప్రస్తుతం లండన్లో పర్యటిస్తున్న అనిల్ వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలను కలుసుకున్నారు. వారంతా కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, రాబోయే రోజుల్లో దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతుందని వారు అభిప్రాయపడ్డట్టు అనిల్ తెలిపారు.
తెలంగాణ అభివృద్ధిని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, కేసీఆర్ నాయకత్వమే భారత దేశానికి శ్రీరామ రక్షా అనే భావన దేశ ప్రజల్లల్లో ఉందన్నారు. ప్రస్తుత జాతీయ పార్టీల శకం ముగిసిందని, కేసీఆర్ నూతన శకానికి నాంది పలికారని, ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే ఉంటారని అనిల్ తెలిపారు.