హైదరాబాద్ : దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (TASA) ఆధ్వర్యంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేసి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ వేడుకలను ఆనందంగా జరిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో నిలబెట్టుకోవడమే కాకుండా కొత్త తరాలకు పరిచయం చేయడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాబోయే 27 సెప్టెంబర్ 2025న జరగబోయే ప్రధాన బతుకమ్మ ఉత్సవానికి అందరిని ఆహ్వానించామన్నారు.