హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సౌత్ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ దేశ బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు. జోహన్బర్గ్, కేపేతౌన్, డర్బన్ రాష్ట్రాల్లో సీఎం పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్.. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేకరాష్ట్రం కలలను సాకారం చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రాష్ట్రాల్లో ఈనెల 18న నిత్యావసరాల సరకుల పంపిణీ, అనాథ ఆశ్రమాల్లో అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు.