కువైట్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను కువైట్ దేశంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను కువైట్ దేశంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్, జాగృతి ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల , కువైట్ జాగృతి అధ్యక్షులు వినయ్ ముత్యాల నాయకత్వంలో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ మాదిరి దేశం కూడా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని వారు వెల్లడించారు.
కేసీఆర్‌ను ప్రధాన మంత్రిగా చూడాలని బీఆర్ఎస్ కువైట్ తరుఫున కోరుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సభ్యులు సురేశ్ గౌడ్, ప్రమోద్ కుమార్, అయ్యప్ప, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

