Chenchu Lakshmi | జార్జియా కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది. అక్టోబర్ 5వ తేదీన నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నిర్వహించిన చెంచు లక్ష్మీ నృత్య నాటిక ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటుతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులనో ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (FCEF)కు అందజేశారు. ఇది పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
దీపాల కాంతి, పూజా మంత్రాల మధ్య నిర్వహించిన ఈ సాంస్కృతిక వేడుకకు హర్షిణి చుండి, శ్రీలేఖ అదుసుమిల్లి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. మాలతి నాగభైరవ ఒక అందమైన వీడియో ద్వారా ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను వివరించారు.
Chenchu Lakshmi4
ఈ కార్యక్రమంలో ఫోర్సిత్ కౌంటీకి చెందిన రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్), మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్) పాల్గొన్నారు.
Chenchu Lakshmi5
నరసింహస్వామి, చెంచులక్ష్మీ మధ్య ఆధ్యాత్మిక ప్రేమగాథ, నల్లమల అడవుల సౌందర్యం, మనసును తాకే సంగీతం, భక్తి పుష్టితో నిండిన నాట్యరూపాలతో సాగిన చెంచులక్ష్మీ నాటకం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా నీలిమ గడ్డమనుగు దర్శకత్వంలో కళాకారుల నృత్యం, భావం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మేళవించారు. తాళం, లయ, అభినయం అన్నీ కలగలిసి ప్రతి క్షణం కళా కాంతుల విరిసిన పుష్పంలా అనిపించింది. ప్రేక్షకులు ఆ నాట్యంలో మునిగిపోయారు.ఈ వేడుకకు 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (District 25), కార్టర్ బారెట్ (District 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు.
Chenchu Lakshmi6
HC Robotics, Assure Guru వంటి సంస్థలు ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి. ఈ సందర్భంగా నిర్వాహకుడు శ్రీరామ్ రొయ్యాల మాట్లాడుతూ.. “సంస్కృతి మనసులను కలుపుతుంది. కళ ద్వారా సమాజ సేవ చేయగలగడం అనేది భక్తితో నిండిన ఆనందం.” అని అన్నారు. “భిన్నత్వంలో ఏకత్వానికి ఇలాంటి కార్యక్రమాలే సజీవ నిదర్శనం.” అని టాడ్ జోన్స్ తెలిపారు.
Chenchu Lakshmi7