Canada – Immigration Policy | విదేశీ పర్యాటకుల ‘వర్క్ పర్మిట్’ నిలిపేసిన కెనడా.. కారణమిదే..!
Canada - Immigration Policy | విదేశీ పర్యాటకులకు దేశీయంగా తాత్కాలిక వర్క్ పర్మిట్లు నిలిపివేస్తూ కెనడా కీలక నిర్ణయం తీసుకున్నది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది.
Canada – Immigration Policy | విదేశీ పర్యాటకులకు దేశీయంగా తాత్కాలిక వర్క్ పర్మిట్లు నిలిపివేస్తూ కెనడా కీలక నిర్ణయం తీసుకున్నది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది. కెనడాలో వర్క్ పర్మిట్ కోసం విదేశీ పర్యాటకులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ఉపసంహరిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ రిప్యూజీస్ అండ్ సిటిజన్ షిప్ కెనడా (ఐఆర్సీసీ) పేర్కొంది. కరోనా మహమ్మారి తర్వాత పెరిగిపోతున్న తాత్కాలిక ఇమ్మిగ్రేషన్లను తగ్గించేందుకు కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘దేశంలోని కంపెనీలు తక్కువ వేతనాలకు పని చేసే తాత్కాలిక విదేశీ వర్కర్లకు తక్కువ శాతం అనుమతులిస్తుంది. లేబర్ మార్కెట్ మారిపోయింది. కెనడా వర్కర్లు, యువత కోసం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాల్సిన సమయం’ అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి వేళ ప్రయాణాలపై ఆంక్షల నేపథ్యంలో దేశాన్ని వీడలేని విదేశీ పర్యాటకుల కోసం కెనడా ప్రభుత్వం.. ఇమ్మిగ్రేషన్, రిప్యూజీస్, కెనడా సిటిజన్ షిప్ (ఐఆర్సీసీ).. విదేశీ పర్యాటకులకు తక్కువ వేతనాలపై తాత్కాలిక వర్క్ పర్మిట్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం కింద విదేశీ పర్యాటకులు కెనడాను వీడకుండా వర్క్ పర్మిట్ కోసం దేశంలోనే పని చేసుకోవచ్చు. దీని ప్రకారం విదేశీ పర్యాటకులు పని చేస్తున్న కంపెనీ యాజమాన్యాల వద్ద పని చేస్తున్నంత కాలం వారికి విదేశీ పర్యాటకుల హోదా కల్పిస్తోంది కెనడా. ఈ వర్క్ పర్మిట్ తో గత 12 నెలలు పని చేసి.. తాజాగా కొత్త వర్క్ పర్మిట్ అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వేచి ఉండాల్సి ఉంటుంది.
2025 ఫిబ్రవరి 28 నాటికి విదేశీ పర్యాటకులకు ఈ తాత్కాలిక వర్క్ పర్మిట్ పాలసీ ముగిసిపోనున్నదని ఐఆర్సీసీ తెలిపింది. కెనడాలో ఉన్న విదేశీ తాత్కాలిక నివాసులను నిర్ధారించడంతోపాటు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ సమగ్రతను కాపాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28 లోపు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది. అయితే, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీయులు కెనడాలో పని చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ కొందరు అక్రమాలకు పాల్పడుతున్న సంగతిని కూడా కెనడా సర్కార్ గుర్తించింది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

