ఆదివారం నాడు డల్లాస్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు డల్లాస్ చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఫ్రిస్కోలో వీరితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా బీఆర్ఎస్ సమన్వయకర్త తన్నీరు మహేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేతలు, ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
శనివారం నాడు కేటీఆర్ డల్లాస్ చేరుకుంటారని ఎన్నారై బీఆర్ఎస్ సమన్వయకర్త మహేష్ బిగాల వెల్లడించారు. ఆదివారం వేడుకకు డల్లాస్, అమెరికావ్యాప్తంగా ఉన్న ప్రవాసులతో పాటు దుబాయి, కెనడా దేశాల నుండి కూడా ప్రవాసులు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు డల్లాస్ చేరుకున్నారు.
శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నేతలు ప్రవాసులను ఉత్సాహపరిచారు. వరంగల్ సభను మించి డల్లాస్ సభ విజయవంతం అవుతుందని, భారాస ప్రభుత్వానికి, తెలంగాణ అభివృద్ధికి ప్రవాసుల చేయూత మరిచిపోలేనిదని నేతలు పేర్కొన్నారు. రసమయి బాలకిషన్ కథలతో తెలంగాణా రాజకీయ పరిస్థితులపై ఛలోక్తలు విసిరారు. గోరేటి వెంకన్నతో కలిసి పాటలు ఆలపించి సభికులను అలరించారు.
ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, వి శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, సుధీర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధు టాటా, గాదరి కిషోర్, బాల్క సుమన్, రసమయి బాలకిషన్,
కొరుకంటి చందర్, గువ్వల బాలరాజ్, క్రాంతి కిరణ్, పైలట్ రోహిత్ రెడ్డి, నోముల భగత్, గ్యాదారి బాలమల్లు, జాన్సన్ నాయక్, ముల విజయరెడ్డి, ముత్తా జయసింహ, నంద్యాల దయాకర్
రఘువీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.