NRI News | గల్ఫ్ కార్మికులకు బీమా.. హర్షం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్
గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపాయం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై బీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని హర్షం వ్యక్తంచేశారు.
హైదరాబాద్: గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపాయం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించడంపై బీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని హర్షం వ్యక్తంచేశారు. నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి ఆశీర్వాద సభల సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపాయం (Gulf Insurance) కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారని శ్రీధర్ అబ్బగౌని అన్నారు.
ఇదే విషయమై బీఆర్ఎస్ ఖతర్ తరఫున తాము గతంలోనే విజ్ఞప్తి చేశామని, దానికి సానుకూలంగా స్పందించి ఎన్నికల వాగ్ధానంలో గల్ఫ్ బీమాను ప్రకటించినందుకు గల్ఫ్ కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ సంక్షేమ బోర్డుతోపాటు ఎన్ఆర్ఐ పాలసీ కూడా రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఏర్పాటు చేస్తుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కష్టాలు సైతం తీరుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికులంతా తమ కుటుంబాల ఓట్లు బీఆర్ఎస్కు వేసి మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్యార్డ్, ఎయిర్క్రాఫ్ట్ యార్డ్లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

