హైదరాబాద్ : బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను గురువారం గల్ఫ్‌లోని దోహా ఖతర్(Qatar)లో గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా పిలుపుమేరకు బీఆర్ఎస్ ఖతర్(BRS Qatar) శాఖ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బాగౌని ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీధర్ అబ్బాగౌని మాట్లాడుతూ కేసీఆర్(KCR) నాయకత్వంలో 22 ఏండ్ల పార్టీ ఆవిర్భావం 9 ఏండ్ల ముఖ్యమంత్రిగా ప్రగతి ప్రస్థానం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు, దేశంలో గుణాత్మక మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఇతర రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ ప్రజాదరణ, మద్దతు వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు.
కాళేశ్వరం(Kaleshwaram), మిషన్ కాకతీయ(Misson Kakatiya) వంటి ప్రాజెక్టులతో పాటు రైతు బంధు(Raitu Bandu), రైతు బీమా,దళిత బంధు(Dalit Bandu),వృద్దులకు పింఛన్లు, మహిళా సంక్షేమం, షాదీ ముబారక్, పల్లె ప్రగతి(Palle pragathi), పట్టణ ప్రగతి , రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, వితంతువులు, దివ్యాంగులకు ఎన్నో పథకాలతో పేదలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్ చింతకుంట, సీనియర్ నాయకులు ఎల్లయ్య తాళ్ళ పెళ్లి, గడ్డి రాజు,అరుణ్ అలిశెట్టి , సంజీవ్ థామస్, సాయి తేజ కుంబాజి, అలీ నక్షబంది, ప్రవీణ్ మోతే పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ లో చేరికలు..
యువ నాయకుడు మహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో శంషేర్ అలీ, జీషాన్, అజీమ్, అర్షద్ తదితరులు ఖతర్ బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఖతర్ బీఆర్ఎస్ నాయకులు నరేష్ చిలువేరి , రాజశేఖర్, పరశురామ్, గంగ రాజు, రాజు, రాకేష్, శేఖర్, దీపక్, నారాయణ, భాస్కర్ గౌడ్, సుభాన్ ప్రమోద్ పాల్గొన్నారు.