BRS celebrations : డాలస్ (Dallas) లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సిల్వర్ జూబ్లీ సెలెబ్రేషన్స్ (Silver Jublee celebrations) సోమవారం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర (Telangana State) ఆవిర్భావ దినోత్సవాన్ని (Formation day) కూడా అంగరంగవైభవంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ (BRS NRI cell) కోఆర్డినేటర్ (Coordinator) మహేశ్ బిగాల (Mahesh Bigala) నేతృత్వంలో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సభ ప్రాంగణాన్ని అలంకరించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ ప్రజలు భారీగా డాలస్‌కు తరలివచ్చి ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు మహేశ్ బిగాల మాట్లాడారు. బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక ఉద్యమ పార్టీగా ఏర్పాటైందని అన్నారు.
కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిందని చెప్పారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. డాలస్ తరహా సెలెబ్రేషన్స్‌ను తమ దేశాల్లో కూడా నిర్వహించాలని యూకే, ఆస్ట్రేలియా, మలేషియా తదితర దేశాల్లోని తెలంగాణ ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
కాగా డాలస్‌లో జరుగుతున్న ఈ సెలెబ్రేషన్స్‌కు కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కళాకారులు హాజరయ్యారు. సభా ప్రాంగణం జై బీఆర్ఎస్.., జై కేసీఆర్.. నినాదాలు మారుమోగాయి.