సిడ్నీ : బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 27 న వరంగల్ లోని ఎల్కతుర్తి లో లక్షలాది మంది తో నిర్వహించే రజతోత్సవ సభ “చలో వరంగల్ ” పోస్టర్ ను బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో చారిత్రాత్మక సిడ్నీ లోని ఓపెరా హౌస్ మరియు హార్బర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
చారిత్రాత్మక రజతోత్సవ సభకు ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని బీఆర్ఎస్ రాపోలు కోరారు.
మన ఇంటి పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి , పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో దేశంలోనే మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాలని, కెసిఆర్ నాయకత్వమే మనకు శ్రీరామా రక్షా అని రవీందర్ చింతామణి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలంతా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని అలాగే రానున్న రోజుల్లో ఆస్ట్రేలియా లో సైతం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కార్యవర్గం పరశురామ్ మొతుకుల్ల, రాహుల్ రాంపల్లి, రాజేందర్ ముదిగొండ మరియు ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.
Aus 02