BRS NRI UK | జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ ఎన్నారై యూకే..!
BRS NRI UK | లండన్ : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎన్నారై యూకే శాఖ అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
BRS NRI UK | లండన్ : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎన్నారై యూకే శాఖ అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అనని మాటను అన్నట్లు చెబుతూ సస్పెండ్ చేశారని నవీన్ రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అబద్ధాలపై జగదీశ్ రెడ్డి ప్రశ్నించారన్నారు. అంతే కాక రైతు రుణమాఫీ, రైతుభరోసా, వృద్ధులకు, వికలాంగులు పింఛన్, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు నిలుపుకోవడం లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నిస్తే, వాటికి సమాధానం చెప్పలేక.. ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ నేతల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
తక్షణమే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని నవీన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ వేదిక ద్వారా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఎన్నారైలంతా బాధ పడుతున్నారన్నారు. తామంతా జగదీశ్ రెడ్డి వెంటే ఉన్నామని తెలియజేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

