హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ను బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల సోమవారం మర్యాదపూర్వకంగా ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు మహేశ్ బిగాల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారైల పక్షాన అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వివిధ కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్న మహేశ్ బిగాలను సీఎం కేసీఆర్ అభినందించారు. అలాగే వివిధ దేశాల్లో ఉన్న అందరి తరపున సీఎంకు మహేశ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.