NRI | కేసీఆర్‌కు వెలుగు పత్రిక బహిరంగ క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ మలేషియా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వెలుగు దిన పత్రికలో ప్రచురితమైన ‘కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే కథనాన్ని బీఆర్ఎస్ మలేషియా శాఖ తీవ్రంగా ఖండించింది.
మలేషియా: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వెలుగు దిన పత్రికలో ప్రచురితమైన ‘కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే కథనాన్ని బీఆర్ఎస్ మలేషియా శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ కథనంపై పత్రిక యాజమాన్యం వెంటనే స్పందించి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేసింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, రైతుల సమస్యలకు ప్రాధాన్యతనివ్వడం మీడియా ప్రధాన బాధ్యతలని బీఆర్ఎస్ మలేషియా ప్రతినిధులు పేర్కొన్నారు. అలాంటి బాధ్యతలను విస్మరించి, రాజకీయ వివాదాలకు ప్రాధాన్యతనిచ్చే కథనాలు ప్రచురించడం పాత్రికేయ విలువలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
మేడిగడ్డ వద్ద నీటి లభ్యత, సాగునీటి సరఫరా, ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. ముఖ్యంగా రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రభుత్వ చర్యలపై సమగ్ర కథనాలు ప్రచురించాలని సూచించారు. కొండపోచమ్మ సాగర్, కాలువల మార్గాలను కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ ప్రచురించిన కథనానికి సంబంధించిన ఆధారాలను V6 వెలుగు యాజమాన్యం ప్రజల ముందుంచాలని బీఆర్ఎస్ మలేషియా డిమాండ్ చేసింది. వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను ధ్రువీకరించడం మీడియా బాధ్యత అని స్పష్టం చేసింది. వివాదాస్పద కథనాన్ని తక్షణమే సమీక్షించి, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న అంశాలను సరిదిద్దడంతో పాటు, కేసీఆర్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ మలేషియా డిమాండ్ చేసింది. అవసరమైన వివరణతో పాటు క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యతతో ప్రచురించాలని కోరింది.
ఈ విషయంలో పత్రిక యాజమాన్యం బాధ్యతాయుతంగా స్పందించకపోతే, మలేషియాలోని తెలంగాణ ఎన్నారైలను ఏకం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వెనుకాడబోమని బీఆర్ఎస్ మలేషియా ప్రతినిధులు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ముఖ్యమని, ప్రజలకు వాస్తవాలను అందిస్తూ నిష్పాక్షికంగా వ్యవహరించాలని వారు పేర్కొన్నారు. కేసీఆర్ గారి ప్రతిష్ఠకు సంబంధించిన ఈ వివాదంపై V6 వెలుగు పత్రిక యాజమాన్యం తక్షణమే స్పందించి, తగిన వివరణతో పాటు బహిరంగ క్షమాపణ ప్రకటించాలని బీఆర్ఎస్ మలేషియా మరోసారి స్పష్టం చేసింది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- apologize
- BRS Malaysia
- KCR
- Nri
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

