Jagadish Reddy | లండన్‌లో ఘనంగా జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు
Jagadish Reddy | మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు గొట్టెముక్కల సతీశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూకేలోని వివిధ ప్రాంతాల్లోని జగదీశ్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.
Jagadish Reddy | మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు గొట్టెముక్కల సతీశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూకేలోని వివిధ ప్రాంతాల్లోని జగదీశ్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జై జగదీశ్ అన్న, లాంగ్ లివ్ జగదీశ్ అన్న అంటూ నినాదాలు చేశారు.
అనంతరం ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. జగదీశ్ రెడ్డి నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ఆయన మరింత సేవలు చేయాలన్నారు. ఉపాధ్యక్షులు రవి కుమార్ రేటినేని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్ అందించడానికి విద్యుత్ శాఖ మంత్రిగా జగదీశ్ రెడ్డి చేసిన కృషిని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు, తాగు నీరు అందించడంలో ఆయన పాత్రను కొనియాడారు.

Brsnriuk1
అధికార ప్రతినిధి రవి ప్రదీప్ గౌడ్ పులుసు మాట్లాడుతూ.. సూర్యాపేట రూపురేఖలను మార్చిన ఘనత జగదీశ్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్య చిలుముల, హరి గౌడ్ నవాబుపేట, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, రవి ప్రదీప్ పులుసు, సత్యపాల్ రెడ్డి పింగళి, తరుణ్ లూనావత్, అబూ జాఫర్, పవన్ కళ్యాణ్, అజయ్ రావు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

