టాక్ లండన్ సంస్థను అభినందించిన బ్రిటన్ మహారాణి
- బ్రిటన్ మహారాణికి కృతఙ్ఞతలు తెలిపిన అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల
లండన్ : గత సంవత్సరం అక్టోబర్ 2021 లో లండన్ వేదికగా తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK ) ఆధ్వర్యంలో టాక్ – చేనేత బతుకమ్మ, దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈసందర్భంగా సామాజిక బాధ్యతతో కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలందించిన నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS UK), ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ లండన్ టవర్ బ్రిడ్జి ఆకృతిని ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే.

టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం – ప్రభలత దంపతుల కూతురు నిత్యశ్రీ టాక్ సంస్థ బతుకమ్మ వేడుకల వేదికగా జరిగిన విషయాలను ప్రత్యేకించి నేషనల్ హెల్త్ సర్వీస్(NHS UK), ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన విధానాన్ని ప్రవాస తెలంగాణ బిడ్డలు బతుకమ్మ వేడుకల్ని జరుపుకొనే విషయాలతో బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ లీమింగ్ కు లేఖ రాసింది.

ఆ లేఖకు బ్రిటన్ మహారాణి కార్యాలయం నుంచి నిత్యశ్రీకి లేఖ అందింది. ఆ లేఖలో మహారాణి బతుకమ్మ వేడుకుల ఫోటోలను చూసి సంతోషం వ్యక్తం చేశారని, ముఖ్యంగా వేడుకల్లో నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS UK), ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలుపడం ఎంతో బాగుందని, టాక్ సంస్థ కృషిని అభినందించినట్టు పేర్కొన్నారు. అలాగే మహారాణి దృష్టికి ఈ విషయాలని తీసుకొచ్చిన నిత్యశ్రీని కూడా ప్రత్యేకంగా అభినందించారు.

టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ఈసందర్భంగా మాట్లాడుతూ… బ్రిటన్ మహారాణి టాక్ సంస్థను అభినందించడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. అలాగే.. ఈ విషయాన్ని మహారాణి దృష్టికి తీసుకెళ్లిన నిత్యశ్రీని రత్నాకర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే.. టాక్ కార్యవర్గ సభ్యులను కూడా రత్నాకర్ అభినందించారు. ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతో టాక్ సంస్థ పనిచేస్తుందని.. ప్రవాస బిడ్డలకు సేవలందిస్తుందని.. మన సంస్కృతి సంప్రదాయలను ప్రపంచానికి చాటి చెబుతుందని రత్నాకర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

