TANH : తెలంగాణ అసోసియేషన్ ఎన్ఆర్ఐ హ్యాంబర్గ్ (TANH) ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుక సంబురంగా జరిగింది. తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక అయిన బోనాలను తొలిసారిగా జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఎన్ఆర్ఐ హ్యాంబర్గ్ (TANH) ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి.
తెలంగాణ అసోసియేషన్ ఎన్ఆర్ఐ హ్యాంబర్గ్ నేతృత్వంలో నిర్వహించిన బోనాల వేడుకలో మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మకు బోనం సమర్పించారు. డప్పుల దరువు, లాస్య నృత్యాలు వంటి సంప్రదాయ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి.

“భారతీయతను, తెలంగాణను, భక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటుదాం!” అన్న సందేశంతో TANH చేపట్టిన ఈ పండుగ కార్యక్రమం ఆద్యంతం హృద్యంగా సాగింది. కుటుంబ సమేతంగా విచ్చేసిన తెలంగాణ సముదాయం సభ్యులు ఈ వేడుకలో పాల్గొని తమ మూలాల పట్ల ప్రేమను చాటుకున్నారు.