లండన్: గతంలో కేసీఆర్ నాయకత్వంలో చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతి సంవత్సరం లాగా నేడు కూడా చేనేత బతుకమ్మ – దసరా సంబురాలు వేడుకలను జరుపుకుంటున్నామని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(Tauk) ఆధ్వర్యంలో లండన్లో(London )చేనేత బతుకమ్మ – దసరా సంబురాలు(Bathukamma Samburalu) ఘనంగా జరిగాయి. ఈ సంబురాలకు యూకే నలుమూలల నుంచి రెండు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వక్తలు మాట్లాడుతూ.. యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని టాక్ సంస్థను చూసి గర్వపడుతున్నామని పేర్కొన్నారు. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న మమ్మల్ని సంప్రదిం చవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక హౌంస్లౌ మేయర్ కారెన్ స్మిత్, భారత సంతతికి చెందిన మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, నిర్మల దంపతులు, భారత హై కమిషన్ ప్రతినిధి అజయ్ కుమార్ ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర ఎఫ్దీసీ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, కౌన్సిలర్లు ప్రీతమ్ గ్రేవాల్, అజ్మీర్ గ్రేవాల్, ప్రభాకర్ ఖాజా, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి – సత్యమూర్తి చిలుమల, టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం, అడ్వైజరి బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, ముఖ్య సభ్యులు పవిత్ర కంది, స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, సత్యం కంది, నవీన్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యపాల్, రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్, మాధవ రెడ్డి ,సతీష్ రెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్, క్రాంతి రేటినేని, శశి, తేజ, నిఖిల్, ప్రవీణ్ వీర, రంజిత్, కార్తీక్, శ్రీధర్ రావు, గణేష్ కుప్పాల, నవ్య, స్నేహ, శైలజ, శ్రీ విద్య, అంజన్ రావు, పృధ్వీ రావుల, మహేందర్, శ్వేతా మహేందర్, మౌనిక, శ్రావ్య, ప్రసాద్, అబ్దుల్ జాఫర్, దీపక్, రాజేష్ వాక, నాగరాజు, మ్యాడి యువజన విభాగం నాయకులు రమేష్, శ్రవణ్ రెడ్డి, తరుణ్ పాల్గొన్నారు.