SCCL Recruitment 2023 | చెస్ట్ ఫిజీషియన్, ఈఎన్టీ సర్జన్, ఆఫ్తాల్మాలజిస్ట్, పీడియాట్రీషియన్, రేడియాలజిస్ట్, జనరల్ సర్జన్, గైనకాలజిస్ట్, హెల్త్ ఆఫీసర్, ఆర్థో సర్జన్, ఫిజీషియన్ తదితర విభాగాలలో మెడికల్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్(Medical Specialist consultant) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్, పీజీ, డీఎన్బీ, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం(Registration Process) ఆన్లైన్లో ఉండగా.. జూలై 07 సాయంత్రం వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు జూలై 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
మొత్తం పోస్టులు : 25
పోస్టులు : మెడికల్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్లు
విభాగాలు : చెస్ట్ ఫిజీషియన్, ఈఎన్టీ సర్జన్, ఆఫ్తాల్మాలజిస్ట్, పీడియాట్రీషియన్, రేడియాలజిస్ట్, జనరల్ సర్జన్, గైనకాలజిస్ట్, హెల్త్ ఆఫీసర్, ఆర్థో సర్జన్, ఫిజీషియన్ తదితరాలు.
అర్హతలు : ఎంబీబీఎస్, పీజీ, డీఎన్బీ, డిప్లొమా.
వయస్సు : 64 ఏండ్లు దాటకుడదు.
ఇంటర్వ్యూ తేదీలు : జూలై 10,11
ఇంటర్వ్యూ వేదిక: SCCL, Head Office, Kothagudem, Bhadradri Kothagudem District.
చివరి తేది: జూలై 07
వెబ్సైట్ : https://scclmines.com/scclnew/index.asp